Ind Hockey: హాకీ టోర్నమెంట్ లో ఫైనల్ కి చేరుకున్న భారత్.. 18 d ago
జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఫైనల్ కు చేరుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3-1తో మలేషియాపై ఘన విజయం సాధించింది. భారత జట్టు బుధవారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్ ను ఢీకొంటుంది. మరో సెమీ ఫైనల్లో పాక్ 4-2తో జపాన్ ను ఓడించింది.